ఆంధ్రప్రదేశ్ లో నేడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున గవర్నర్ ప్రసంగం ఉండటం ఆనవాయితీ. గవర్నర్ చదివే ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదిస్తుంది. అయితే, ఈ ప్రసంగంలో ఖచ్చితంగా మూడు రాజధానుల అంశం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ గవర్నర్ వివాదాస్పద అంశాల జోలికెళ్లకుండా ప్రభుత్వ పథకాలు, వాటి లక్ష్యాలు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలనే చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టం అంశాలు ప్రస్తుతం జరిగే సమావేశాల్లో చర్చించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.