వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాల్తేరు వీరయ్య టికెట్‌పై రూ.25, వీరసింహారెడ్డి టికెట్‌పై రూ.20 పెంచుకోవచ్చని ఉత్వర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్లపై రూ.45 పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా వీరసింహారెడ్డి మూవీ రేపు రిలీజ్ కానుంది. వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానుంది.