మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు అంశాల్లో అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని అన్నారు. రాష్ట్ర పరిధిలోనే రాజధాని అంశం ఉంటుందని కేంద్రం ఎప్పుడో చెప్పిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పాలన వికేంద్రీకరణ చేస్తామని తాము మొదటినుంచీ చెప్తున్నామని, ఆ మాటలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.