జీవో నంబర్ 1పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు గడపనెక్కింది. జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తెచ్చింది. చంద్రబాబు సభలో 8 మంది చనిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ హైకోర్టు ఈ జీవోపై స్టే విధించింది.