పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో NGT విధించిన పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ఏపీ సర్కారు రూ.250 కోట్లు చెల్లించాలని NGT గతంలో జరిమానా విధించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అన్ని అంశాలను పరిశీలించిన ధర్మాసనం జరిమానా చెల్లించాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీనిపై మళ్లీ విచారణ చేపడతామని తెలిపింది.