ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములను కేవలం రాజధాని అభివృద్ధికే ఉపయోగించాలని తెలిపింది. ఒప్పందం ప్రకారం వాటిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించింది. అంతేగాక అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వాలని, అభివృద్ధిపై ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని పేర్కొంది. దీంతో పాటు పిటిషన్ల ఖర్చు రూ.50వేలు ఇవ్వాలని కూడా ఆదేశించింది.