ఏపీ ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ఇంటర్ బోర్డు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు నచ్చని కొంత మంది హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. పరీక్షలకు వారం రోజులు ఉండగా అలా ఎలా ఆదేశాలిస్తారని ఇంటర్ బోర్డుని ప్రశ్నించి.. ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేటి నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అంతా సెట్ అయింది అని అనుకున్నారు. కానీ ఏపీ ఇంటర్ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో మరో షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పింది.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు