ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ని సవరిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తొలుత ఏప్రిల్ 9 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ అదే సమయంలో జేఈఈ పరీక్షలు కూడ ఉన్నాయి. దీంతో పరీక్షలను ఏప్రిల్ 22- మే 12 వరకు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు.