ఏపీలో పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌కు సంబంధించి షెడ్యూల్ విడులైంది. ఈ మేరకు ఏపీఈఏపీసెట్-2023 పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మే 5న ఏపీఈసెట్ జరగనుంది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్‌కు సంబంధించి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 24, 25న ఏపీ ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా వివిధ యూనివర్సిటీల్లో.. పలు కోర్సుల్లో యూజీ, పీజీ ప్రవేశాలు కల్పిస్తారు.