వాలంటీర్లు బచ్చాగాళ్లు…తీసిపారేస్తాం: మంత్రి

Courtesy Twitter:rajadadishetty

ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చాగాళ్లంటూ మంత్రి మాట్లాడారు. వాళ్లు మనపై పెత్తనం చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారని దాడిశెట్టి రాజా అన్నారు. వాళ్లను మనమే పెట్టామని , నచ్చకపోతే తీసేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలదేనన్న మంత్రి… సెక్రటేరియట్ ను అదుపులోకి తీసుకుని నడిపించాలన్నారు.

Exit mobile version