ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని.. నారా లోకేష్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే గుడివాడలో తనపై గెలిచి చూపించాలని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్.. 151మంది గెలిపించిన జగన్ కు పోలికే లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికే సీఎం జగన్ పాలనా వికేంద్రీకరణకు పూనుకున్నారని స్పష్టం చేశారు. జగన్ తప్పకుండా విశాఖ నుంచే పాలన సాగిస్తారని కుండబద్దలు కొట్టారు. కొంతమంది వ్యవస్థలను అడ్డంపెట్టుకుని వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.