తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును తిరిగి ఏపీకి ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నాడని పేర్ని నాని విమర్శించారు. పవన్.. తమ పార్టీ మీద, మంత్రుల మీద పవన్ చేసిన విమర్శల మీద మంత్రి నాని కౌంటర్ వేశారు. చిరంజీవికి నమస్కారం పెట్టలేని పవన్ కల్యాణ్ సంస్కారం ఎక్కడ అంటూ నాని పవన్ మీద నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ ఓ రాజకీయ ఊసరవెల్లి అంటూ విమర్శించారు.