ఓ ఫ్రెషర్ బిటెక్ విద్యార్థిని భారీ ప్యాకేజీ ఉన్న జాబ్ సొంతం చేసుకుంది. తనకు ఏడాదికి రూ.44 లక్షల శాలరీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఈ ఉద్యోగం అందిపుచ్చుకుంది. ఏపీలోని పులివెందుల ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బిటెక్ చదువుతున్న హర్షితకు ఈ అవకాశం లభించింది. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపల్, జేఎన్టీయూ వీసీ సహా పలువురు అధికారులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.