AP: బాధ్యతలు స్వీకరించిన మంత్రులు

© File Photo

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ఐదుగురు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తమ ఛాంబర్లలో పూజలు నిర్వహించి శుభముహూర్తాన విడదల రజిని, మేరుగ నాగార్జున, కె.నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం నారాయణ స్వామి సీఎం జగన్ ఫొటోతో సచివాలయ ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు.

Exit mobile version