ఉక్రెయిన్ పై రష్యా యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి తీసుకొచ్చే మిషన్ విజయవంతంగా పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. నిన్న 89 మంది విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్నారు. వీరితో కలిపి మొత్తం 689 మంది విద్యార్థులు ఢిల్లీ, ముంబయిలకు వచ్చి అక్కడి నుంచి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. కాగా, ఈ మిషన్ కోసం ఏపీ ప్రభుత్వం రూ.2.70 కోట్లు ఖర్చు చేసింది.