ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఎస్సెస్సీ ఫలితాలు వెలువడాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు ప్రకటించలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. అయితే సమయాన్ని వెల్లడించలేదు. దీంతో విద్యాశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.