• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్థూలవృద్ధిలో ఏపీ దేశంలోనే టాప్: బుగ్గన

    స్థూలవృద్ధిలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆర్థికమంత్రి బుగ్గన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి 11.43 శాతంగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాదని చెప్పుకొచ్చారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేల) బలోపేతం ద్వారా రైతులకు మేలు జరుగుతోందని తెలిపారు. సకాలంలో అన్నదాతలకు పనిముట్లు, విత్తనాలు అందుతున్నాయని వెల్లడించారు. ఆర్బీకేల పనితీరును నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని గుర్తు చేశారు. పొలం బడి కార్యక్రమాల ద్వారా దిగుబడి పెరిగిందని వ్యవసాయ లెక్కలు చెప్పారు.