దేశంలో వరుసగా 8సారి ఇంధన ధరలు పెరిగాయి. గత 9 రోజుల్లో ఇంధన ధరలను 8వ సారి మార్చి 30న లీటరుకు పెట్రోల్, డీజిల్ పై రూ.80 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర: రూ.114.51, డీజిల్ రేటు రూ.100.70కి చేరింది. ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర: రూ.116.45, డీజిల్ ధర రూ.102.27కు పెరిగింది. ఇక ఢిల్లీలో పెట్రోల్ రూ.101.01 కాగా, డీజిల్ రేటు రూ. 92.27గా ఉంది. మరోవైపు ముంబైలో పెట్రోల్ రూ.115.88, డీజిల్ రూ.100.10గా అమ్ముతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల ఇంధన రేట్లతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్నాయి.