టాటా ట్రస్ట్స్ తొలి సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా అపర్ణ ఉప్పలూరిని నియమిస్తున్నట్లు టాటా ట్రస్ట్స్ ప్రకటించింది. అలాగే సీఈఓగా సిద్ధార్ధ్ శర్మను నియమించింది. ఈ నియామకాలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా అపర్ణ ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్లో ఇండియా, నేపాల్, శ్రీలంకల ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కృషి చేసి పేరుపొందారు. కాగా టాటా ట్రస్ట్స్ పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఇది కూడా ఒకటి.