కేంద్రానికి వాట్సాప్ క్షమాపణలు చెప్పింది. న్యూఇయర్ సందర్భంగా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపింది. చైనా అక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను మ్యాప్‌లో మినహాయించింది. దీనిపై కేంద్రం ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో పనిచేసే వ్యాపార సంస్థలు సరైన మ్యాప్‌లు చూపాలని హెచ్చరించారు. వెంటనే స్పందించిన వాట్సాప్ జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటామని వెల్లడించింది.