యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన వేతనంలో దాదాపు సగానికిపైగా కోత పడనుంది. తనకు అందే ప్యాకేజీలో 40 శాతం కోత పడే అవకాశం ఉంది. టిమ్ కుకే స్వయంగా జీతం తగ్గించమని సంస్థకు చెప్పినట్లుగా సమాచారం. గతేడాది కుక్ దాదాపు 100 మిలియన్ డాలర్లు ప్యాకేజీ తీసుకునేవారు. ప్రస్తుతం అది 49 మిలియన్ డాలర్లకు తగ్గిపోనుంది. కాగా గతేడాది యాపిల్ షేర్లు 27 శాతం పతనమయ్యాయి. ఈ ఏడాది యాపిల్ షేర్లు ఫరవాలేద నిపిస్తున్నాయి. ప్రస్తుతం యాపిల్ షేర్లు 3 శాతం పెరిగాయి.