రాష్ట్రంలో 17,291 పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈసారి అమ్మాయిల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం 3.5లక్షల దరఖాస్తులు రాగా..వాటిలో సుమారు 26శాతం దరఖాస్తులు మహిళలవే ఉన్నాయి. పోలీస్, ఎక్సైజ్, రవాణా పోస్టుల భర్తీకి వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు జారీచేశారు. కానీ మూడింటికీ రాతపరీక్షల సిలబస్ ఒకే విధంగా ఉంది. దీంతో పాటు ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ టెస్టులు, ఫైనల్ ఎగ్జామ్ కూడా ఒకేసారి నిర్వహించనున్నారు.. అయితే ఏఆర్, సీఏఆర్, టీఎస్‌ఎస్పీ పోస్టులకు లైట్ మోటార్ వెహికల్ లైసైన్స్ ఉంటే మూడు మార్కుల చొప్పున వెయిటేజీ లభిస్తుంది.