పాతికేళ్ల వయసుకే కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా ఎన్. గాయత్రి నియమితులయ్యారు.పేదరికంలో పుట్టినా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కోలార్ మహిళా కళాశాలలో బీకాం చదివిన ఆమె..కేజీఎఫ్‌లోని కెంగల్ హనుమంతయ్య కళాశాలలో 2021లో న్యాయ విద్య పూర్తి చేశారు. అదే ఏడాది సివిల్ న్యాయమూర్తి పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూలో విఫలమయ్యారు. మళ్లీ ఇటీవల నిర్వహించిన ముఖాముఖిలో సత్తా చాటి న్యాయమూర్తిగా నియమితులయ్యారు.