ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్(FICA) అధ్యక్షురాలిగా లీసా స్తాలేకర్ నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. స్విట్జర్లాండ్‌లోని న్యోన్‌లో జరిగిన FICA ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఫికా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హీత్ మిల్స్ ప్రెసిడెంట్ సోలంకికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అసోసియేషన్ ఆటగాళ్ల హక్కులు, సమస్యలను పరిష్కరించనుంది.