TS: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభుత్వం నియామకాలను చేపడుతోంది. ఈ క్రమంలో పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. నెలకు రూ.30వేల వేతనం ఇవ్వనున్నారు. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. డిసెంబరు 5న ఇంటర్వ్యూ ఉంటుంది. 7న ముసాయిదా మెరిట్ ప్రకటించి.. 10న తుది మెరిట్‌ను విడుదల చేస్తారు. జిల్లా కలెక్టర్లు రేపే నోటిఫికేషన్ని జారీ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18నుంచి కంటివెలుగు ప్రారంభం కానుంది.
కంటి వెలుగు కోసం నియామకాలు

© Envato