దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

© File Photo

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. నిన్నటి(975)తో పోల్చుకుంటే ఈ సంఖ్య 17 శాతం ఎక్కువ. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 11,558కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా సంబంధ కారణాలతో కన్ను మూశారు. పాజిటివిటీ రేటు 0.03 శాతంగా ఉంది. మళ్లీకేసుల సంఖ్య 1,000 దాటడంతో పలువురు టెన్షన్‌కు గురవుతున్నారు.

Exit mobile version