రాష్ట్రంలో 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 1500 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి కొనుగోలుకు రూ. 572 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. కర్నాటక తరహాలో 15 మీటర్ల బస్సులు తీసుకొస్తామని ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలోనే ఇన్ని బస్సులు కొనుగోలు చేయడం తొలిసారని చెప్పారు.