మ్యూజిక్ లెజెడ్ ఏఆర్ రెహమాన్ ఒక తెరిచిన పుస్తకం అని ‘సీతారామం’ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అన్నారు. జనవరి 6న రెహమాన్ 56వ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి విశాల్ కొన్ని విషయాలు పంచుకున్నారు. రెహమాన్ స్కూల్ నుంచే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఎంతో మంది సంగీత విద్వాంసులను దేశానికి అందించారని కొనియాడారు. కేఎమ్ మ్యూజిక్ కన్జర్వేటరీ నుంచి నాణ్యమైన సంగీతాన్నినిరుపేదలకు ఉచితంగా నేర్పిస్తున్నారని తెలిపారు.