తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో నిర్వహించిన ‘#AskKTR’ కార్యక్రమంలో ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. TRS పార్టీ తరువాతి సీఎం అభ్యర్థి మీరేనా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ‘కేసీఆర్ రూపంలో తెలంగాణకు అద్భుతమైన సీఎం ఉన్నారు. ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్ కొడతారు’ అంటూ KTR సమాధానమిచ్చారు.