క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ సారి కూడా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ ను ఒక్కటంటే ఒక్క మ్యాచులో కూడా ఆడించలేదు. దీనిపై సచిన్ ఫ్యాన్స్ గుస్సా అయ్యారు. ఎప్పుడో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై అతడిని ఆడిస్తే బాగుండేదని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై ఆజట్టు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించారు. కేవలం సచిన్ కొడుకని అతడిని ఆడించలేమని తెలిపాడు. అర్జున్ ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో మరింత మెరుగవ్వాలని తెలిపాడు. అప్పుడే అతడికి తుది జట్టులో స్థానం లభిస్తుందని వివరించాడు.