భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కొండల్లో కూలిపోయింది. ఈ ఘటన అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖామెంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ సింగే నుంచి మిసామారేకు వెళ్తోంది. ఈ క్రమంలో మండల హిల్స్ ప్రాంతం చేరుకునేసరికి హెలీకాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్‌లో పైలెట్, కో పైలెట్ ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి కోసం ఆర్మీ సేనలు గాలింపు చర్యలు చేపట్టాయి.