ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌లో ప్రమాదానికి గురైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మండాలా హిల్స్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. పైలట్‌ల కోసం సెర్చ్ ఆపరేషన్‌ని ప్రారంభించారు. ఈరోజు ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంతో చీతా హెలికాప్టర్ కనెక్షన్ కోల్పోయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.