బాలీవుడ్ బాద్‌షా పఠాన్ సినిమాపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసిన నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కర్ణవాటిలోని ఓ మాల్‌లో పఠాన్ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన పోస్టర్లు, కటౌట్లను చించివేశారు. హోర్డింగ్‌లను తొలగించారు. పోస్టర్లను కాలుతో తంతూ నిరసన తెలిపారు. ఇందులోని బేషరమ్ రంగ్ పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాయ్‌కాట్ పఠాన్ వివాదం దుమారం రేపుతోంది.