పెద్దాసుపత్రులకే పరిమితమైన ఆరోగ్యశ్రీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ తీసుకెళ్లాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. జూన్ 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్ సీల్లో ఆరోగ్యశ్రీ అమలుకు ఉత్తర్వులు జారీచేసింది. 53 రకాల వ్యాధులకు ప్రాథమిక కేంద్రంలోనే చికిత్స అందించనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైనపుడు రిఫరల్ సిస్టమ్ ద్వారా ఆరోగ్యశ్రీ అమలు సులువు కానుంది. గ్రామీణ స్థాయిలో ఆరోగ్యశ్రీని అమలుచేయడం దేశంలోనే తొలిసారని ఆరోగ్యమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
-
© File Photo
-
© File Photo