బంగాల్ పదవీచ్యుత మంత్రి పార్థా చటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ, ఇవాళ పోలీసులు వైద్య పరీక్షలకు తీసుకెళ్లగా కారు దిగననంటూ మారాం చేసింది. కారులోనే ఏడుస్తూ దిగనంటే దిగనంటూ మొండికేసింది. దీంతో కాసేపు బతిమాలిన పోలీసులు బలవంతంగా ఆసుపత్రిలోకి లాక్కెళ్లారు. వీల్ చెయిర్ లో తీసుకెళ్తుండగా అర్పితా ముఖర్జీ ఏడుస్తూనే ఉంది. విద్యాశాఖలో ఉద్యోగాల కుంభకోణం కేసులో అర్పితా ముఖర్జీ, పార్థా చటర్జీ అరెస్టైన విషయం విదితమే. ఈడీ సోదాల్లో ఆమె ఇంట్లో సుమారు రూ.50 కోట్ల డబ్బులు దొరికాయి.
కారు దిగనంటూ అర్పితా ముఖర్జీ మారాం

© ANI Photo