ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్ జారీ

Screengrab Instagram:

ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు చైన్నై జార్జీటౌన్ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే 2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ MLA అరుళ్ అన్బరసు ఓ టీవీ ఛానెళ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ముకుంద్ చంద్ గురించి వీరు పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిపై ముకుంద్ చంద్ పరువునష్టం దావా కేసు వేశారు. అయితే ప్రస్తుతం ముకుంద్ మరణించినప్పటికీ తన కుమారుడు ఈ కేసును కొనసాగిస్తున్నారు. ఈ వివాదం మంగళవారం మళ్లీ విచారణకు వచ్చింది. కాని సెల్వమణీ హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Exit mobile version