ముంబై మహానగరం మరోసారి కరోనా టెన్షన్ తో కంగారు పడిపోతుంది. నగరంలో నమోదవుతున్న కేసులను చూస్తుంటే ఫోర్త్ వేవ్ వచ్చిందా? అనే అనుమానం కలుగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 2,087 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనా టెర్రర్ తో నగరవాసులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం నగరంలో 13,897 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 95 మంది ఆసుపత్రిలో చేరగా.. 1,802 మంది కోలుకున్నారు.