తెలంగాణ కాంగ్రెస్ లో అగ్రకుల దురహంకారం: దాసోజు

© ANI Photo

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరాచకాలు సృష్టిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో అగ్రకుల దురహంకారం ఉంది. తన వర్గం నేతలను బలవంతులుగా చూపే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కులం, ధనమే కీలకమయ్యాయి. సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు అందిస్తున్నారు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. సొంత ముఠాతో పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు.

Exit mobile version