గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు నమోదు చేశాడు. కేవలం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. పరగుల సంగతి ఎలా ఉన్నా నో బాల్స్ విషయంలో అర్ష్దీప్ దారుణ రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 5 నోబాల్స్ వేసిన అర్ష్దీప్…భారత టీ20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన తొలి ఆటగాడిగా తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు.