బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అసని’ తుఫాను కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో లేనప్పటికీ వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుందని, కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు తక్కువ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.