తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఇరు రాష్ట్రాల మంత్రులు మాటా మాటా అనుకున్నారు కూడా. అయితే ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. ‘ఒక మంత్రి హైదరాబాద్లో కరెంట్ లేదని ఆరోపిస్తే, ఇంకో మంత్రి కరెంట్ బిల్లు కట్టకపోతే సప్లై కట్ చేస్తామని చెప్పడం వినోదానికి బాగుటుంది కానీ, పరిపాలనకు కాదు. ప్రజలను వైసీపీ గాలికి వదిలేసింది’ అంటూ వ్యాఖ్యానించారు.