కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్?

© ANI Photo

కాంగ్రెస్‌కు నూతన అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఎన్నికకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం ఆయనకు సోనియాగాంధీ తెలిపినట్లు సమాచారం. ఈసారి కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేనట్లు తెలిసింది. ఈ నెల 28న జరిగే సీడబ్యూసీ మీటింగ్‌లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి సీఎం పదవిని సచిన్ పైలట్‌కు అప్పగించాలని సోనియా భావిస్తున్నారు. తద్వారా రాజస్థాన్‌లో అసమ్మతి తగ్గించాలని సోనియా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version