విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసింది టీమ్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఇందులో విశ్వక్, నాకు బ్రేకప్ సాంగ్ కావాలని అడుగుతున్నాడు. ఎలా ఉండాలో చెప్పమని అడిగాడు మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్. విశ్వక్ తన బాధనంతా వెల్లబోశాడు. అతడి ఫీలింగ్స్‌కు తగినట్లుగా అప్పటికప్పుడే ఒక సాంగ్‌ను ట్యూన్ చేసి ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. రామ్ సిలక సాంగ్ మార్చి 31న విడుదల కాబోతుంది. ఇది ‘బ్రేకప్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ కాబోతుందనిచిత్రబృందం ప్రకటించింది.