మతాంతర వివిహం చేసుకుందన్న కక్షతో ఇటీవల అశ్రిన్ సుల్తానే అనే మహిళ భర్తను ఆమె సోదరుడు నడిరోడ్డుపై దారుణంగా హత్యచేశాడు. మే 4న సరూర్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె భర్త కుటుంబసభ్యులతో వికారాబాద్ జిల్లాలోని మర్పల్లిలో ఉంటుంది. తాజగా మీడియాతో మాట్లాడిన ఆమె జైలులో ఉన్న తన సోదరుడని కలిసేందుకు ఒక ఐదు నిమిషాలు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరుతుంది. తన భర్తను చంపితే పోయిన పరువు తిరిగి వచ్చిందేమో తెలుసుకుంటానని చెప్తుంది. ఆమె సోదరుడిది చిన్నప్పటినుంచి క్రిమినల్ మైండ్ అని, అతడు కొట్టడం వల్లే గతంలో తన తండ్రి చనిపోయాడని చెప్పుకొచ్చింది.