బిగ్‌బాస్‌లో ఈరోజు సండే ఫండే ఎపిసోడ్ సరదాగా ఉండబోతుంది. హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్ అడిస్తూ, డ్యాన్స్ చేయిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగార్జున. ఇక చివరికి నామినేషన్స్‌లో ఉన్నవారిలో అరియానా, అషు ఇద్దరు మిగిలారు. అయితే బాబా మాస్టర్ దగ్గర ఉన్న ఎవిక్షన్ -ఫ్రీ పాస్ ఎవరికోసమైనా ఉపయోగిస్తారా లేదా మీరు ఉపయోగించుకుంటారా అని నాగ్ అడిగాడు. దీంతో సందిగ్ధంలో పడ్డాడు మాస్టర్. కానీ చివరికి ఎవిక్షన్-ఫ్రీ పాస్ ఎవరికి ఇవ్వకుండా బాబా తన వద్దే పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈరోజు అషు రెడ్డి ఎలిమినేట్ అయినట్లుగా సోషల్‌మీడియాలో టాక్ నడుస్తుంది.
https://youtube.com/watch?v=nYx9IMQebHs%0A