టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 434 వికెట్ల రికార్డును అశ్విన్ అధిగమించాడు. దీంతో టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ 435 వికెట్ల ఘనతను సాధించాడు. కపిల్ తన 85వ మ్యాచ్లో ఆ రికార్డును అధిగమించాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 మ్యాచ్ల్లో 619 వికెట్ల తర్వాత, అశ్విన్ ఇప్పుడు టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు.