టీ20 ప్రపంచకప్లో భారత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యలపై టీమిండియా ప్లేయర్ అశ్విన్ స్పందించాడు. పాంటింగ్ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. ‘చిన్న చిన్న ఘటనలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాయి. పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవాలి. పాక్తో మ్యాచులో మేం చివరి బాల్ వరకు పోరాడాం. పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేదని సరైంది కాదు. అప్పటి పరిస్థితులకు లోబడి ఆడాల్సి ఉంటుంది. అలాగే ఆడి మేం గెలిచాం’ అని అశ్విన్ బదులిచ్చాడు. 4 మ్యాచుల్లో 3 విజయాలతో టీమిండియా టాప్ ప్లేసులో ఉంది.
పాంటింగ్ని తప్పు పట్టిన అశ్విన్

© ANI Photo