భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక 5 వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. భారత గడ్డపై అనిల్ కుంబ్లే 25 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించగా.. అశ్విన్ 26 సార్లు ఈ ఫీట్ సాధించాడు. అలాగే టెస్టుల్లో భారత్ తరఫున ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్(113) నిలిచాడు. దీంతో కుంబ్లే (111) రికార్డు తెరమరుగైంది.