మన హక్కులను కాలరాసే ఎవర్నైనా ఎదుర్కొవాల్సిందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. “ ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో విమర్శలు ఎదుర్కొంటారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలి. మన కష్టం, శ్రమకు తగిన ఫలితం దక్కాలి. జనాభాకు తగినట్లు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని కోరాలా? దేహి అంటే కుదరదు. పోరాడి సాధించాలి “ అన్నారు.