ఏపీలో పొత్తుల రగడ ఒక లెవెల్లో నడుస్తోంది. అధికార వైసీపీని ఓడించాలని ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటుగా చాలా మంది కంకణం కట్టుకుని కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కొంత మంది పొత్తుల గురించి ప్రశ్నిస్తూ జనసేనతో పొత్తు ఉంటుందా? అని అడిగారు. తాము పొత్తుల విషయంలో క్లియర్ గా ఉన్నామని జనసేనతో తప్పకుండా పొత్తు ఉంటుందని ఆయన ప్రకటించారు. జనసేన, టీడీపీ పొత్తు గురించి మీడియా వారు అతడ్ని అడగ్గా.. మీరు ఆ విషయం పవన్ కల్యాణ్ నే అడగాలని సూచించారు.